‘వృషభ’ Mohanlal కోడలుగా బాలీవుడ్ నటి.. Roshan నక్కతోక తొక్కేశాడంటున్న ఫ్యాన్స్..

by Prasanna |   ( Updated:2023-07-16 10:02:03.0  )
‘వృషభ’ Mohanlal కోడలుగా బాలీవుడ్ నటి.. Roshan నక్కతోక తొక్కేశాడంటున్న ఫ్యాన్స్..
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మోహన్‌లాల్ కొత్త సినిమా ‘వృషభ’తో పాన్ ఇండియా అరంగేట్రం చేస్తున్న షనయా కపూర్.. ఈ అవకాశం దక్కినందుకు హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఇందులో మోహన్ లాల్ కొడుకుగా కనిపించనున్న రోషన్ సరసన నటించబోతున్న ఆమె.. గతానికి, వర్తమానానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో సహాయపడే ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ చిత్రం నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చిత్రీకరణ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. తప్పకుండా ఈ మూవీ నా కెరీర్‌లో ఉన్నతంగా నిలిచిపోతుంది’ అని పేర్కొంది. ఇక ‘ఈ చిత్రంలో షనయా నటిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఆమె పాత్రనుంచి స్టార్ పిల్లలంతా ప్రేరణ పొందుతారని భావిస్తున్నాం. షనయాను మా బృందంలో కలుపుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఆమె నటనా నైపుణ్యాలకు మేము మంత్ర ముగ్ధులయ్యాం’ అంటూ నటిని పొగిడేశారు దర్శకనిర్మాతలు. దీనిపై స్పందిస్తు్న్న నెటిజన్లు రోషన్ నక్కతోక తొక్కేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: నా పేరు లేకుండా పాపం ఏ పని చేయలేకపోతున్నారు: Anasuya

Advertisement

Next Story