అబ్రహంను ముద్దుపెట్టుకున్న షారుఖ్.. ఎమోషనలైన దీపిక (వీడియో)

by sudharani |   ( Updated:2023-10-10 15:58:57.0  )
అబ్రహంను ముద్దుపెట్టుకున్న షారుఖ్.. ఎమోషనలైన దీపిక (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం విలేకరులతో సమావేశం అయ్యారు మూవీ టీమ్. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహంతో పాటు దర్శకుడు సిద్ధార్థ్ ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. ఇందులో భాగంగా షారుఖ్.. జాన్ అబ్రహంను మెచ్చుకుంటూ ముద్దుపెట్టుకున్నాడు.

అలాగే నటి దీపిక పడుకొనె మాట్లాడుతూ ..'నాకు షారుఖ్ తో 'ఓం శాంతి ఓం' నుంచి మంచి అనుబంధం ఉంది. ఈ రోజు కూడా నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినందుకు థాంక్యూ. ఇది కనుక దక్కకుంటే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉండే దాన్ని కాదు. కానీ నిజం చెబుతున్నా మన మనసు నిజాయితీ, చిత్తశుద్ధితో పని చేస్తే దానికి ప్రతిఫలంగా ఇలాంటి ప్రేమలు దక్కుతాయి' అంటూ ఎమోషనల్ అయింది.

Advertisement

Next Story