ఆ రోజు నిజంగానే చనిపోయినట్లు అనిపించింది: షాహీన్ భట్

by Hajipasha |
ఆ రోజు నిజంగానే చనిపోయినట్లు అనిపించింది: షాహీన్ భట్
X

దిశ, సినిమా: ప్రముఖ నటి అలియా భట్ సోదరి షహీన్ భట్ మరోసారి తన మెంటల్ హెల్త్ ఇష్యూస్‌పై ఓపెన్ అయింది. చిన్నతనం నుంచి ఎన్నో బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నానన్న ఆమె.. ఒంటరిగా చీకటి లోకంలోకి నెట్టివేయబడినట్లు ఫీల్ అయ్యానని ఎమోషనల్ అయింది. అంతేకాదు మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులను చూసి ఎగతాళి చేసే వారిని ఉద్దేశిస్తూ.. 'ఈ పరిస్థితిని మీరు మీరు అర్థం చేసుకోలేరు. కానీ మద్దతు ఇవ్వండి' అని కోరింది. అలాగే తానెప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని.. తనపై ఇతరుల అభిప్రాయాలను తలకెక్కించుకుని మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసుకోలేనని చెప్పింది. ఇక కుటుంబ సభ్యులతోపాటు క్లోజ్‌గా ఉన్న వ్యక్తులను కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదన్న షహీన్.. ఏడేళ్ల క్రితం 'పానిక్ అటాక్' జరిగినప్పటి నుంచి భయాందోళనకు గురవుతున్నాని, కొన్ని సార్లు నిజంగానే చనిపోతున్నట్లు అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed