- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 ఏళ్ల అమ్మాయితో Shah Rukh రొమాన్స్.. భిన్నంగా స్పందించిన Kajol !
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరోల పై నటి కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 50 ఏళ్ల వయసున్న షారుఖ్ లాంటి నటులు 20 ఏళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుంటే తాను మాత్రం 24ఏళ్ల యువకుడికి తల్లిగా నటిస్తున్నానంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. ఆమె ఇటీవల నటించిన 'సలామ్ వెంకీ' డిసెంబర్ 9న విడుదలై పాజిటీవ్ టాక్ సొంతం చేసుకోగా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కాజోల్. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ.. 'నేను షారుఖ్ మూడు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో పనిచేస్తున్నాం. అయితే ఈ వ్యాపార రంగంలో పురుషులందరూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను కలిగివున్నారనేది వాస్తవం. ఇదే క్రమంలో వారంతా ఒక పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఒకమాటలో చెప్పాలంటే ఇండస్ట్రీని తమ భుజాల మీద మొస్తున్నారు. ఒక సినిమా హిట్ కావాలంటే హీరో ఫర్ఫార్మెన్స్ కీలకం. కాబట్టి స్త్రీ, పురుష భేదాల్లో మా మధ్య హెచ్చుతగ్గులున్నప్పటికీ వివక్షలు లేవు. చిన్న అమ్మాయిలతో సీనియర్ల తీస్తున్న సినిమాలను జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో స్టార్ హీరోలుగా పేరుగాంచిన వారు పరిశ్రమను నిలబెట్టేందుకు ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చింది.