ఆమెతో జాగ్రత్త అంటూ నయనతార భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుఖ్.. ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-07-13 03:44:41.0  )
ఆమెతో జాగ్రత్త అంటూ నయనతార భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుఖ్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ జంటగా నటించిన చిత్రం ‘జవాన్’. దీనిని డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ఈ మూవీ హిట్ కొట్టడం పక్కా అని గట్టిగా నమ్ముతున్నారు.

ఈ క్రమంలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ ‘జవాన్’ సినిమాపై ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఇటువంటి బడా సినిమాతో అట్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. ట్రైలర్‌ ఇంటర్నేషనల్ రేంజ్ లో సూపర్ గా ఉంది. షారుక్ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టాలనే నా భార్య నయన్‌ డ్రీమ్ నెరవేరింది. మూవీ టీమ్ మొత్తానికి నా తరపున ప్రత్యేకంగా అభినందనలు అని విఘ్నేష్ రాసుకొచ్చారు’.

తాజాగా, అది చూసిన షారుఖ్ విఘ్నేష్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘ విఘ్నేష్ మా చిత్రంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు. నయనతార ఓ అద్భుతమైన హీరోయిన్. ఇప్పటికే ఈ విషయం మీకు తెలుసు కదా. రీసెంట్‌గా ఆమె కొన్ని కీలకమైన పంచ్‌లు స్పెషల్‌గా నేర్చుకుంది. కాబట్టి బీ కేర్ ఫుల్’’ అంటూ సరదాగా రాసుకొచ్చారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ట్వీట్ వైరల్‌గా మారింది.

Also Read: ఈ వారం థియేటర్లో,ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే..

Advertisement

Next Story