నాది సహాయం మాత్రమే.. గౌరీ స్వయంగా పని చేసింది: షారుఖ్ ప్రశంసలు

by Vinod kumar |   ( Updated:2023-05-18 11:25:05.0  )
నాది సహాయం మాత్రమే.. గౌరీ స్వయంగా పని చేసింది: షారుఖ్ ప్రశంసలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్ పనివిధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంటీరియర్ డిజైనర్‌గా పేరుగాంచిన గౌరీ.. ఈ వ్యాపారం ప్రారంభించినపుడు తనకు అన్ని విధాలుగా సాయం చేస్తానని మాటిచ్చినట్లు గుర్తుచేసుకున్నాడు. అయితే తాను చెప్పినట్లుగానే హెల్ప్ మాత్రమే చేస్తున్నానన్న షారుఖ్.. ‘నాది సహాయం మాత్రమే. కానీ, ఆమె స్వయంగా పనిచేస్తుంది.

తనంతట తానుగా ఎన్నో అద్భుతమైన వర్క్ అవుట్‌లు చేసి చూపించింది. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని ఒక దుకాణంలో మొదలైన తన ప్రయాణం.. గౌరికి గొప్ప స్టార్‌డమ్‌ను తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు.

Also Read: ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లపై సునిశిత్ కామెంట్స్ వైరల్.. ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

Advertisement

Next Story