బాలీవుడ్‌‌ను నాశనం చేసిందే షారుఖ్ ఖాన్: Vivek Agnihotri

by samatah |   ( Updated:2023-08-18 08:28:06.0  )
బాలీవుడ్‌‌ను నాశనం చేసిందే షారుఖ్ ఖాన్: Vivek Agnihotri
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌పై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్‌గా ఓ సమావేశంలో వివేక్ మాట్లాడుతూ.. ‘నేను కూడా షారుఖ్ ఖాన్ అభిమానినే. కానీ అతనిలాంటి చరిష్మా ఉన్న వ్యక్తి మరొకరు లేరు. ముఖ్యంగా షారుఖ్ రాజకీయాలను ఇష్టపడడు. ఆయనకు నచ్చవు. బాలీవుడ్ లాంటి గొప్ప ఇండస్ట్రీని నాశనం చేయడానికి అతనిలాంటి వాళ్లు బాధ్యులని నేను భావిస్తాను. బాలీవుడ్‌లో అన్నింటినీ నాశనం చేశారు. ఇప్పుడంతా పబ్లిక్ రిలేషన్‌ హైప్, గ్లామర్, స్టార్‌డమ్ అంటూ అసలు స్టార్‌డమ్ కానిదాన్నే అంగీకరిస్తున్నారు. నా సినిమా సక్సెస్ అయితే అది ప్రజల సినిమా. అందువల్ల మేము భిన్న ధృవాలపై నిల్చున్నాం. అయినా అతనంటే ఇష్టం. అంతేకాదు షారుఖ్‌తో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఒకవేళ అతను నా సినిమాలో నటిస్తే రైటర్‌గా, డైరెక్టర్‌గా ఆయన ముందుంటా’ అని అన్నారు. ఇక వివేక్ కామెంట్స్‌ పరిశీలిస్తే షారుఖ్‌ను పొగుడుతూనే కౌంటర్ వేసినట్లు అర్థమవుతుంది.

Read More: ప్రభాస్ ‘యోగి’ సినిమా రీ రిలీజ్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే? (వీడియో)

Advertisement

Next Story