పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో షారుఖ్ ఖాన్.. హైప్ నెక్స్ట్ లెవల్.. ఫ్యాన్స్‌కు పండగే..

by Nagaya |   ( Updated:2023-08-26 13:00:52.0  )
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో షారుఖ్ ఖాన్.. హైప్ నెక్స్ట్ లెవల్.. ఫ్యాన్స్‌కు పండగే..
X

దిశ, సినిమా: ఇటు రాజకీయలతో బిజీగా ఉంటూనే మరింత ఉత్సాహంగా సినిమా ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇందులో ‘OG’ మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 1990 నాటి ముంబై మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై ముందునుండి అంచనాలు భారీగా ఉన్నాయి. ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు సుజిత్‌తో షారుఖ్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ కావడంతో.. ఈ రూమర్ స్ప్రెడ్ కాగా ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Read More: ‘జై భీమ్’ సినిమా విషయంలో బీజేపీ రాజకీయం.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్

Advertisement

Next Story