‘Jawan’ సక్సెస్‌మీట్‌‌కు హాజరుకాని Nayanatara.. కారణం చెప్పిన Sharukh Khan

by Nagaya |   ( Updated:2023-09-16 16:11:14.0  )
‘Jawan’ సక్సెస్‌మీట్‌‌కు హాజరుకాని Nayanatara.. కారణం చెప్పిన Sharukh Khan
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. ఈ కార్యక్రమానికి నటీనటులు అందరు హాజరైనప్పటికీ మెయిన్ హీరోయిన్ నయనతార మాత్రం రాలేదు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్ ఇందుకు గల కారణం తెలిపాడు. ‘‘జవాన్’ సినిమా సక్సెస్‌లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను సౌత్ ఇండియన్ సినిమాలకు పెద్ద అభిమానిని. భాష తెలియకపోయినా దక్షిణాది సినిమాలు చూసేవాడిని. అక్కడ నటీనటులతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యా. ఇందులో నటించిన విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొనే, ప్రియమణి, సన్యా మల్హోత్రా సహా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ఇంత హ్యాపీ మూమెంట్‌ను నయనతార మిస్ అయింది. ఈ రోజు నయనతార తల్లి పుట్టినరోజు. అందుకే ఆమె రాలేకపోయింది. ఆమె తల్లికి నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు’ అని తెలిపాడు షారుఖ్.

ఇవి కూడా చదవండి : Naveen,Anushka కాంబోపై Ram Charan ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Advertisement

Next Story