Anushka Shetty: ‘భాగమతి’ మూవీకి సీక్వెల్‌.. పవర్ ఫుల్ రోల్‌లోAnushka Shetty

by Hamsa |   ( Updated:2024-09-29 14:37:54.0  )
Anushka Shetty: ‘భాగమతి’ మూవీకి సీక్వెల్‌.. పవర్ ఫుల్ రోల్‌లోAnushka Shetty
X

దిశ, సినిమా: అరుంధతి సినిమాతో అనుష్క శెట్టి ఇండస్ట్రీని షేక్ చేసి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి చిత్రంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఆమె హారర్ థ్రిల్లర్‌ జోనర్‌లో ‘భాగమతి’ చేసింది. దీనిని అశోక్ తెరకెక్కించగా.. 2018లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

దాదాపు 6 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ రాబోతున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశోక్.. ‘‘భాగమతి సీక్వెల్‌ 2025లో సెట్స్‌పైకి వెళ్తుంది. దీనిని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. అయితే ఇందులో అనుష్క శెట్టి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనుంది. ఊహించిన దానికంటే మరింత ఆసక్తికరంగా ఆమె పాత్ర ఉండబోతుంది’’ అని చెప్పుకొచ్చారు. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు

Read More: రవితేజ, అనుష్క క్యూట్ ఫొటోస్

ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న అనుష్క.?. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisement

Next Story