Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. భవిష్యత్తులో సీఎం అవ్వడం పక్కా అంటూ

by Kavitha |
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. భవిష్యత్తులో సీఎం అవ్వడం పక్కా అంటూ
X

దిశ, సినిమా: విజయ నిర్మల కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన టాలీవుడ్ సీనియర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన పలు చిత్రాల్లో హీరోగా, కమేడియన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా తండ్రి పాత్రలు చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కాగా ఈయన మూవీస్ కంటే వ్యక్తిగత జీవితంలో పవిత్ర లోకేష్‌తో సహజీవనం వంటి వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తు ఉంటారు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, సినిమా సంగతులతో పాటు గతంలో బీజేపీ నేతగా పనిచేసిన అనుభవం ఉండటంతో నరేష్ సమకాలీన అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరాంజనేయులు విహారయత్ర’. ఈ సినిమా ఆగస్ట్ 14న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నరేష్ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈటీవీతో తనది 40 ఏళ్ల ఎమోషనల్ బంధమని.. ఈనాడు కాంపౌండ్‌లో మనిషినని చెప్పుకోవడానికి తనకు గర్వంగా ఉందన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గెలుపు, ఆ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. “స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి నేటి వరకు సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలది అవినాభావ సంబంధం. రాష్ట్రంలో మార్పు కోసం ఖచ్చితంగా పవన్ నిలబడతారు. ఆ దమ్ము ఆయనలో ఉందని నాకు ఎప్పుడో తెలుసు. దానిని నిజం చేస్తూ పవన్ గెలిచాడు, గెలిపించుకున్నాడు.. ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు” అంటూ నరేష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story