‘ఫైటర్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో రెచ్చిపోయిన హృతిక్, దీపిక

by sudharani |   ( Updated:2023-12-22 14:16:11.0  )
‘ఫైటర్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో రెచ్చిపోయిన హృతిక్, దీపిక
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఫైటర్’. వార్, పఠాన్ సినిమాల‌ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీ.. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఫైటర్’ రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా సెకండ్ సింగిల్ ‘ఇష్క్ జైసా కుచ్’ అనే రొమాంటిక్ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో హృతిక్ రోషన్, దీపికా ఫుల్ రొమాంటిక్ మోడ్‌లో కనిపించగా.. వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read More..

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్

Advertisement

Next Story