సుశాంత్ సింగ్ రెండవ వర్ధంతి.. సోదరి హార్ట్ ఫెల్ట్ నోట్

by Manoj |
సుశాంత్ సింగ్ రెండవ వర్ధంతి.. సోదరి హార్ట్ ఫెల్ట్ నోట్
X

దిశ, సినిమా : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెండవ వర్ధంతి సందర్భంగా తన సోదరి శ్వేతా‌సింగ్ కీర్తి భావోద్వేగపూరితమైన నివాళులర్పించింది. 'సుశాంత్ భాయ్‌ మీరు మమ్మల్ని, ఇంటిని విడిచిపెట్టి రెండేళ్లు పూర్తయింది. కానీ మీరు నడిచిన దారి, విలువలు, అందరి పట్ల దయ, కరుణ, ప్రేమ మీ సద్గుణాల కారణంగా అమరత్వం పొందారు. మీ గౌరవార్థం.. ఎంతో మందికి సాయం చేయాలనుకున్న మీ ఆశయాన్ని మేము కొనసాగిస్తున్నాం. మన ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చాలని కలలుగన్న సుశాంత్ భాయ్‌కి మనమందరం దీపం వెలిగిద్దాం? ఈ రోజు ఒకరి ముఖంలోనైనా చిరునవ్వు తీసుకురావడానికి నిస్వార్థంగా పనిచేద్దాం' అని ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. కాగా 2020 జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed