'సర్దార్‌'లో విశ్వరూపం చూపించిన కార్తీ.. ఆకట్టుకుంటున్న టీజర్

by Hamsa |   ( Updated:2022-09-30 07:38:42.0  )
సర్దార్‌లో విశ్వరూపం చూపించిన కార్తీ.. ఆకట్టుకుంటున్న టీజర్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో కార్తీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా తనకు మంచి క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో 'సర్దార్' ఒకటి. పీఎస్‌.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీకి జోడిగా రాశీఖన్నా, రజిషా విజయన్‌ నటించారు. దీపావళి కానుకగా తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది.ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా చిత్రబృందం మూవీ టీజర్‌ను విడుదల చేసింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో విడుదలైన టీజర్‌‌లో కార్తీ విభిన్న గెటప్స్‌లో కనిపించి క్యూరియాసిటీని పెంచుతున్నాడు.

Also Read: గూస్‌బంప్స్.. 'ఆదిపురుష్' ఫస్ట్‌లుక్ విడుదల

Advertisement

Next Story