నేను కాస్ట్లీ బట్టలు అసలే తొడగను.. కావాలంటే నా వార్డ్ రోబ్ చూడండి: Sara Ali Khan

by samatah |   ( Updated:2023-08-03 07:28:31.0  )
నేను కాస్ట్లీ బట్టలు అసలే తొడగను.. కావాలంటే నా వార్డ్ రోబ్ చూడండి: Sara Ali Khan
X

దిశ, సినిమా: స్టార్ కిడ్ సారా అలీఖాన్ తన పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నిజానికి తాను ఆర్థికంగా ఉన్నత ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఎల్లప్పుడూ సాధారణ మహిళగానే ఉండటాన్ని ఇష్టపడతానని చెప్పింది. ముఖ్యంగా బట్టల విషయంలో సింపుల్‌గా ఉంటానన్న ఆమె.. తన వార్డ్‌రోబ్‌లో ఒకే జత డిజైనర్‌చే తయారు చేయించిన డ్రెస్ ఉందని తెలిపింది. ‘మన శరీరం కాస్ట్లీ డిజైన్ బట్టలను ధరించడంకంటే నిజాయితీతో కూడిన గర్వాన్ని కలిగివుండాలని కోరుకుంటాను. ప్రజలు మొదట్లో నన్ను చూసి దాని గురించి మాట్లాడుకున్నారు. నా తీరు బాగా నచ్చిందని చెప్పారు. నన్ను అభినందించడమే కాకుండా ఈ కారణాల వల్ల నన్ను గుర్తించడం సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రేక్షకులు సెలబ్రిటీల నుంచి ఎల్లప్పుడూ నిజాయితి, విలువలు కోరుకుంటారని తాను స్వయంగా గుర్తించినట్లు వెల్లడించింది.

Read More: రాజ్‌తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగరేసుకుపోతాడు: జబర్దస్త్ అప్పారావు

Next Story