Sara Ali Khan: అది నా ఇష్టం.. మీకెందుకు?.. హిందూ-ముస్లిం గొడవపై సారా

by Prasanna |   ( Updated:2023-03-24 14:33:55.0  )
Sara Ali Khan: అది నా ఇష్టం.. మీకెందుకు?..  హిందూ-ముస్లిం గొడవపై సారా
X

దిశ, సినిమా : ముస్లిం కుటుంబంలో జన్మించి.. హిందూ దేవాలయాలకు ఎందుకు వెళ్తుందంటూ వస్తున్న విమర్శలను సారా అలీఖాన్ తిప్పికొట్టింది. నిజానికి తనకు శివుడంటే చాలా నమ్మకం, ఇష్టమన్న ఆమె.. వీలైనప్పుడల్లా ముంబైలోని మహాదేవ్ గుడికి వెళ్లి మొక్కుకుంటానని చెప్పింది. విషయానికొస్తే.. తాను నటించిన ‘గ్యాస్ లైట్’ త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది సారా. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను హిందువుల గుడికి వెళ్లానంటూ వస్తున్న అనవసర రాద్ధాంతం గురించి పెద్దగా పట్టించుకోవాలని అనుకోవట్లేదు. నా నటన గురించి ప్రేక్షకులు కామెంట్స్ చేస్తే యాక్సెప్ట్ చేస్తా. కానీ, నా వ్యక్తిగత విషయాలు లేదా నా జీవనశైలితో ఎవరికైనా సమస్య ఉంటే మాత్రం అస్సలు లెక్కచేయను’ అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. అలాగే ఇటీవల వరుస చిత్రాల్లో గొప్ప పాత్రలు పోషిస్తుండటం గర్వంగా ఉందని తెలిపింది సారా.

Also Read..

Actress Sana: నా కూతురిని దుబాయ్‌ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..?

Advertisement

Next Story