సల్మాన్‌తో నటించాలంటే అలాంటి స్క్రిప్ట్ కావాలి.. సన్యా కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-09-18 04:50:03.0  )
సల్మాన్‌తో నటించాలంటే అలాంటి స్క్రిప్ట్ కావాలి.. సన్యా కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సన్యా మల్హోత్రా సీనియర్ హీరో సల్మాన్ ఖాన్‌తో స్ర్కీన్ షేరింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘దంగల్’మూవీతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఆమె బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ‘జవాన్’లోనూ ఓ కీలక పాత్ర పోషించిన ఆమె ఓ చిట్‌ చాట్‌ సెషన్‌లో చెప్పిన మాట ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ మేరకు సల్మాన్‌ ఖాన్‌‌తో స్క్రీన్ షేరింగ్ అంటే చాలా ఇష్టమని, ప్రేక్షకులు కూడా తాను సల్మాన్‌ ఖాన్‌తో నటించాలని కోరుకుంటున్నట్లు గమనించినట్లు తెలిపింది. అలాగే ఆయనతో కలిసి పనిచేయాలంటే అంచనాలకు మించిపోయే బెస్ట్‌ స్క్రిప్ట్ కావాలన్న నటి.. ‘Larger than life persona @BeingSalmanKhan’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story