‘అన్నీ అనుకున్నట్లు జరిగుంటే బాగుండు’.. అక్కినేని అమలతో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ హీరో కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2023-08-04 12:55:40.0  )
‘అన్నీ అనుకున్నట్లు జరిగుంటే బాగుండు’.. అక్కినేని అమలతో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ హీరో కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అమల గురించి అందరికి తెలిసిందే. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులకు దక్కించుకున్న ఆమె.. అక్కినేని నాగర్జునను ప్రేమ వివాహం చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరమైందనే చెప్పాలి. తన పెళ్లి అనంతరం సినిమాల కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు అమల.

ఇదిలా ఉంటే.. తమిళంలో ‘మైథిలి ఎన్నై కాదలై’ అనే సినిమాతో తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత స్టార్ నటుడు సంజయ్ కపూర్‌తో ఫొటో షూట్‌లో పాల్గొని సందడి చేసింది. అప్పుడు దిగిన ఫొటోను సంజయ్ కపూర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘ఇది నా ఫస్ట్ ఫొటో షూట్.. అందమైన, తెలివైన అమలతో కలిసి ఈ షూట్‌లో పాల్గొన్నాను. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే తనే నాతో కలిసి నటించే తొలి హీరోయిన్ అయ్యుండేది, కానీ అలా జరగలేదు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story