Sandeep Kishan: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.. ‘రాయన్’పై సందీప్ కామెంట్స్ వైరల్

by sudharani |   ( Updated:2024-07-24 13:46:04.0  )
Sandeep Kishan: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.. ‘రాయన్’పై సందీప్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: గత కొంతకాలంగా వరుసఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న యంగ్ హీరో సందీప్‌కిషన్‌ ఇటీవల 'భైరవకోన' చిత్రంతో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రజెంట్ మరో మూవీతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'రాయన్‌'. తమిళ హీరో ధనుష్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ కీలకపాత్రలో కనిపిస్తాడు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్‌కిషన్‌ మూవీకి సంబంధించి పలు విశేషాలు పంచుకున్నారు.

'నా కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రను ఇందులో చేశాను. ఇలాంటి పాత్ర చాలా అరుదుగా లభిస్తుంది. నాకు నటుడిగా నిరూపించుకోవడానికి వచ్చిన మరో అవకాశం ఇది. ధనుష్‌ తన కోసం రాసుకున్న పాత్రను నాకు ఇచ్చాడు. నా రోల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే, ఎమోషనల్‌గా సీరియస్‌గా ఉంటుంది. నా పాత్రలో చాలా వెరియేషన్స్‌ వున్నాయి. ధనుష్‌కు సోదరుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఈ చిత్ర కథకు బలం. రాయన్‌ నా కెరీర్‌లో ఓ ఢిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా నటుడిగా చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం భైరవకోన సీక్వెల్‌తో పాటు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే మాయవన్‌ అనే సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో టైప్ మూవీతో పాటు.. స్వరూప్‌ దర్శకత్వంలో వైబ్‌ అనే సినిమా చేస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed