గౌతమ్‌కు అన్యాయం చేసిన సందీప్.. ఈ సీజన్ వరెస్ట్ సంచాలక్‌ అతనే..

by Nagaya |   ( Updated:2023-09-22 13:47:30.0  )
గౌతమ్‌కు అన్యాయం చేసిన సందీప్.. ఈ సీజన్ వరెస్ట్ సంచాలక్‌ అతనే..
X

దిశ, సినిమా : బిగ్ బాస్ హౌజ్ టాస్క్‌లు రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. థర్డ్ కంటెండర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే శోభా శెట్టి అత్యంత కారంగా ఉన్న చికెన్ పీస్‌లు తినాల్సి ఉంటుందని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆమె 27 తినగా.. ఈ పోటీకి తగదని తెలిపిన గౌతమ్, శుభ శ్రీ, ప్రశాంత్‌ 28 తినాల్సి ఉంటుందని, అప్పుడు ఆమె ప్లేస్‌లో కంటెండర్‌గా వెళ్తారని చెప్పాడు. అయితే గౌతమ్.. శోభ కన్నా తక్కువ టైమ్‌లోనే 28 ముక్కలు తినేశాడు. కానీ ఆ 28వ పీస్‌లో కొంచెం మాత్రం తినలేదని.. కాబట్టి 27 తిన్నట్లు సంచాలక్‌గా నిర్ణయించాడు సందీప్. ఇదే విషయాన్ని బిగ్ బాస్‌కు చెప్పడంతో.. శోభ మూడో కంటెండర్‌గా అర్హత సాధించింది. గౌతమ్‌కు అన్యాయం జరిగింది. దీంతో ఈ వీడియో చూసిన ఆడియన్స్.. సందీప్‌ను వరెస్ట్ సంచాలక్‌గా విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed