Samantha : విజయ్‌కి కాబోయే భార్య అలా ఉండాలి అంటూ సమంత కామెంట్స్

by samatah |   ( Updated:2023-08-17 08:08:00.0  )
Samantha : విజయ్‌కి కాబోయే భార్య అలా ఉండాలి అంటూ సమంత కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఖుషి. శివనిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఇప్పటికే సమంత, విజయ్ ఈ మూవీ ప్రమోషన్స్ చేపట్టారు. కాగా, సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత విజయ్ దేవరకొండకు కాబోయే భార్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

విజయ్ గురించి సమంత మాట్లాడుతూ.. “విజయ్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడడు.. మెసేజ్లు మాత్రమే చేస్తాడు, ఒక సాధారణ అమ్మాయి, ఫ్యామిలీతో కలిసిపోయే అమ్మాయి, అలాంటి అన్ని లక్షణాలున్న అమ్మాయి తనకు భార్యగా రావాలని విజయ్ కోరుకుంటున్నాడు” అంటూ సమంత తెలిపింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Read More : ఎంత ప్రేమించినా సరిపోదు అంటూ విజయ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసిన సమంత.. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ కామెంట్స్

ఖుషి ఈవెంట్‌లో నాగచైతన్యను తలుచుకొని కన్నీరు పెట్టుకున్న సమంత( వీడియో)

Advertisement

Next Story

Most Viewed