Kushi Trailer : సమంత ‘ఖుషి’ ట్రైలర్‌పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Hamsa |   ( Updated:2023-08-05 06:10:58.0  )
Kushi Trailer  : సమంత ‘ఖుషి’ ట్రైలర్‌పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, యంగ్ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సామ్ ఫ్యాన్స్ ‘ఖుషి’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌పై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఖుషి ట్రైలర్ 2 నిమిషాల 41 సెకన్ల పాటు ఉండనుందని. సెన్సార్ కూడీ పూర్తి చేసుకుందని సర్టిఫికెట్‌ను పోస్ట్ చేశాడు. కాగా, ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న విడుదల కానున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్స్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story