Samantha : విషమంగా మారిన ఆరోగ్య పరిస్థితి.. తక్షణ చికిత్స మొదలు

by samatah |   ( Updated:2023-07-12 12:39:36.0  )
Samantha : విషమంగా మారిన ఆరోగ్య పరిస్థితి.. తక్షణ చికిత్స మొదలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి సమంత అనారోగ్యం కారణంగా మళ్లీ నటన నుంచి విరామం తీసుకోనుంది. గత సంవత్సరం మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ కాగా అప్పటి నుంచి, ఆమె చికిత్స తీసుకుంటూ పూర్తి ఆరోగ్యం కోసం పోరాడుతూనే ఉంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు తెలుస్తోంది. తక్షణమే శ్రద్ధ వహించాలని డాక్టర్లు సూచించారట. అందుకని సమంత నిర్మాతల నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చింది. ట్రీట్‌మెంట్‌ కోసం దక్షిణ కొరియాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికి సమంత పరిస్థితి తిరిగి మొదటికి రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Read more: Divyansha Kaushik : సమంత వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైందా?

Advertisement

Next Story

Most Viewed