Samantha-Vijay Devarakonda ‘Kushi’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ఫట్టా?

by Hamsa |   ( Updated:2023-09-01 10:02:07.0  )
Samantha-Vijay Devarakonda ‘Kushi’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ఫట్టా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. దీనిని డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సూపర్ హిట్ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. భారీ అంచనాల నడుమ నేడు ఖుషి (సెప్టెంబర్1) ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.

అయితే ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఖుషి మూవీని చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. చాలా కాలం తర్వాత హిట్ కొట్టామని విజయ్-సమంత అభిమానులు చెబుతున్నారు. అలాగడే వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని కామెడీ బాగుందని అంటున్నారు. అలాగే చివరి 30 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుందని, అది సినిమాకు పెద్ద ప్లస్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సంగీతం కూడా బాగుందంటూ ఓ నెటిజన్ 3/5 రేటింగ్ ఇచ్చాడు. మొత్తానికైతే ఖుషి సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని హిట్టు కొట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత యశోద సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ లైగర్ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. వీరిద్దరూ ఫ్లాప్ తర్వాత తీసిన ‘ఖుషి’ హిట్ అందుకుంటే సామ్, విజయ్ ఇద్దరూ లక్‌లో పడినట్లేనని కొందరు అనుకుంటున్నారు.

Advertisement

Next Story