ఆ పని చేసిన సమంత.. ఫైర్ అవుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-31 05:20:03.0  )
ఆ పని చేసిన సమంత.. ఫైర్ అవుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పటికీ తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా, సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకొని, విడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా? వారు విడిపోవడానికి గల కారణం ఇదే అంటూ అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. కాగా, సమంతకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సమంత చేతిలో బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఏవీ లేవు. సామ్ సిటాడెల్ వెబ్ సిరీస్‌‌లో నటిస్తుంది. ఇది కాకుండా మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. అంతకు మించి సమంత పెద్ద పెద్ద సినిమాలు ఏం చేయడం లేదు. అయితే ఈ మధ్య సమంత ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది అంటే అనేక వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, సమంత కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ఓ వార్త వైరల్ అయ్యింది. అయితే ఆఫర్‌ను సమంత రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన వెట్రిమారన్ దర్శకుడితో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా సమంత అయితే బాగుంటుంది అనుకొని ఆమెను సంప్రదించారు మేకర్స్. అయితే సామ్ ఈ ఆఫర్‌ను సున్నితంగా రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. నిజంగా సమంత మూవీ నుంచి తప్పుకుందా, లేదా ఇది కూడా ఓ పుకారో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed