- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం నిలబడాల్సిన టైం వచ్చింది.. మరోసారి సంచలనంగా సమంత పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో జరగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మలయాళ సినీ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ చాలా విషయాలను బయట పెట్టింది. అక్కడ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి చక్కగా వివరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాంటి కమిషనే ఏర్పాటు చెయ్యాలి అని తెలిపింది. అలాగే.. ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న మహిళా నటీమణులు, పడుతున్న ఇబ్బందులు, లైంగిక వేధింపుల మీద తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేయడంతో.. ఈ విషయం సంచలనంగా మారింది. తాజాగా, మరోసారి సమంత దీనిపై స్పందించింది.
ఈ మేరకు ‘మార్పు అవసరం.. మన కార్యాలయాన్ని పునర్నిర్మిద్దాం!.. హేమ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని మహిళలు ధైర్యంగా మౌనం వీడాలని నిర్ణయించుకున్నారు. నివేదికలో వచ్చిన ఫలితాల ఆధారంగా.. మహిళలు తమ వర్క్ ప్లేస్‌లో ఎదుర్కొంటున్న దోపిడీని ఎత్తిచూపడానికి ముందుకు వచ్చారు. వర్క్ ప్లేస్‌లో ఏ రూపంలోనైనా లింగ వివక్షకు, లైంగిక అట్రాసిటీలకు సమానమైన గురుత్వాకర్షణ ఉంటుందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. సినిమా పరిశ్రమలో ప్రబలంగా ఉన్న లింగ అసమానతను అరికట్టేందుకు మరింత స్థిరమైన, పారదర్శకమైన వ్యవస్థను నివేదిక సిఫార్సు చేసింది. చిత్ర పరిశ్రమను జెండర్-కేస్ట్ వర్క్‌ప్లేస్‌గా మార్చడంలో ప్రభుత్వంతో పాటు ఇతర చలనచిత్ర సంస్థలు కలిసి నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. పునరాలోచించండి.. పునర్నిర్మించు.. పునర్నిర్మించండి’ అంటూ సమంత ఇన్‌స్టా వేదికగా స్టోరీ పెట్టింది. ప్రజెంట్ అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.