ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా అలా చేస్తున్న సమంత షాకింగ్ పోస్ట్ వైరల్.. కారణం అదేనా?

by Hamsa |   ( Updated:2024-05-06 13:17:50.0  )
ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా అలా చేస్తున్న సమంత షాకింగ్ పోస్ట్ వైరల్.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఏడాదిపాటు సినిమాలు చేయకపోయినా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. మయోసైటీస్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇటీవల హెల్త్ పాడ్ కాస్ట్ మొదలెట్టడం కాకుండా.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. అంతేకాకుండా యాడ్ షూట్స్ చేసి చేతినిండా డబ్బులు సంపాదిస్తుంది. అలాగే నిత్యం పలు విషయాలపై స్పందిస్తూ.. అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే సమంత ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ఇటీవల ఈ అమ్మడు పుట్టిన రోజు వేడుకలు గ్రీస్‌లోని రెస్టారెంట్‌లో జరుపుకుంది. ఈ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అంతా ఆమెకు వ్యాధి తగ్గిపోయిందని అనుకున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, సమంత ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ‘‘ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రత్యామ్నాయ విధానాలు వెతుకుతున్నాను. ఫార్ ఇన్‌ఫ్రారెడ్ ట్రీట్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు. కండరాలకు మెరుగైన రక్త ప్రసరణ, జీవక్రియను పెంచడం, శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. తగ్గిన సెల్యులైట్, చర్మాన్ని పునరుజీవింపజేస్తుంది. కీళ్లు కండరాల నొప్పిని తగ్గిస్తుంది, ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఒంటిపై బట్టలు లేకుండా టవల్ కట్టుకుని ఓ చైర్‌పై కూర్చున్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాకుండా నగ్నంగా బాత్ టబ్‌లో ఉన్న ఫొటో కూడా పోస్ట్ చేసి డిలీట్ చేసిందట. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు వైరల్ కావడంతో అవి చూసిన కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరు కంగారు పడిపోతున్నారు. సమంతకు మయోసైటీస్ తగ్గలేదా అందుకే ఈ వైద్యం తీసుకుంటుందా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అసలు సమంత ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఆమెకు ఏమైందని అంటున్నారు. అయితే సమంత నిజంగా నగ్నంగా ఉన్న ఫొటో పెట్టిందా? లేక అది ఎడిట్ ఫొటోనా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం సామ్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Advertisement

Next Story