Chiranjeevi,Prabhas ను క్రాస్ చేసిన Samantha.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆమె వెనకే..

by sudharani |   ( Updated:2023-09-04 14:48:10.0  )
Chiranjeevi,Prabhas ను క్రాస్ చేసిన Samantha.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆమె వెనకే..
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లో రూ.70 కోట్లు వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో రూ.15 కోట్లు గ్రాస్ సాధించి.. అక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖుషి సినిమా అక్కడ వన్ మిలియన్ దాటి 1.5 మిలియన్‌కు చేరువలో ఉంది. ఇప్పటికే సమంత హీరోయిన్‌గా చేసిన 16 సినిమాలు అమెరికాలో వన్ మిలియన్ సాధించగా.. ‘ఖుషి’ 17 వ సినిమాగా నిలిచింది.

ఇక విజయ్ కెరీర్‌లో అమెరికాలో వన్ మిలియన్ దాటిన 4 వ సినిమాగా ఖుషి ఉంది. ఇక మన తెలుగు హీరోల విషయానికి వస్తే.. అమెరికాలో మహేశ్ బాబు 11 సినిమాలు వన్ మిలియన్ సాధించాయి. నాచురల్ స్టార్ నాని-8, యంగ్ టైగర్ ఎన్టీఆర్-7, పవర్ స్టార్ పవన్ కల్యాణ్-7, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-5, రెబల్ స్టార్ ప్రభాస్-5, మెగా స్టార్ చిరంజీవి-4, రౌడీ హీరో విజయ్ దేవరకొండ-4 సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం సమంత వెనుకే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

National Awards కాంట్రవర్సీపై స్పందించిన Rana Daggubati.. Allu Arjun ను తిట్టారా.. పొగిడారా..? ఆ కామెంట్స్ వైరల్

ఇప్పటికే నాకు పెళ్లైపోవాల్సింది కానీ.. తమన్న కామెంట్స్ వైరల్

Advertisement

Next Story