ఆక్సిజన్ మాస్క్‌తో కనిపించిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2023-04-27 09:10:46.0  )
ఆక్సిజన్ మాస్క్‌తో కనిపించిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజులు మయోసైటిస్‌తో బాధపడుతూ ఇంటికే పరిమితమైంది. అయితే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటూ తన తదుపరి సినిమాల షూటింగ్ స్టార్ట్ చేసింది. అయినప్పటికి ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్స్‌లో ఇంకా పూర్తిగా కోలుకోలేదన్నట్లు చెప్పుకొచ్చింది. అలసట, నీరసంతో బాధపడుతున్నాని, తన కళ్లు కెమెరా లైట్స్ చూడలేకపోవడంతోనే గ్లాసెస్ పెట్టుకుంటున్నట్లు తెలిపింది. అయితే లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో సామ్ పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేసింది. ఆమె ఆక్సిజన్ మాస్క్‌తో కనిపించడంతో మళ్లీ ఏమైందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే దీని గురించి సామ్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

Also Read..

చైతుతో డేటింగ్ విషయాన్ని శోభితా ఎందుకు దాచిపెడుతోంది?

Advertisement

Next Story