‘టైగర్ 3’ సినిమా సెట్‌లో సల్మాన్ ఖాన్‌కు గాయం.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-19 10:09:20.0  )
‘టైగర్ 3’ సినిమా సెట్‌లో సల్మాన్ ఖాన్‌కు గాయం.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తమిళ సినిమా ‘వీరం’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ప్రస్తుతం కండ వీరుడు సల్లూ భాయ్ ‘టైగర్-3’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. 2012 లో వచ్చిన ఏక్ థా టైగర్, 2017 లో వచ్చిన టైగర్ జిందా హైకి.. ఈ చిత్రం కొనసాగింపుగా వస్తుంది. ఇందులో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడు. తాజాగా, సల్మాన్ ఖాన్‌కు షూటింగ్ సెట్‌లో గాయం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ‘‘మీరు ప్రపంచపు బరువును మీ భుజాలపై మోస్తున్నారని మీరు అనుకున్నప్పుడు, అతను ప్రపంచాన్ని వదిలేసి కిలో డంబెల్ ఎత్తి చూపగలడు. టైగర్ కూడా అలాగే ఉన్నాడు’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా భుజంపై దెచ్చ తగిలినట్లుగా స్టిక్కర్స్ వేసుకున్నట్లు ఉన్న ఓ పిక్‌ను కూడా షేర్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే షూటింగ్‌లో భాగంగా గాయం అయినట్లుగా స్టిక్కర్స్ వేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: పుష్ప 2 సినిమా నుంచి కొత్త అప్డేట్..

Advertisement

Next Story

Most Viewed