సీన్ మారింది.. షారుఖ్‌ను రీప్లేస్ చేసిన ప్రభాస్.. ఒక్క షో కూడా లేకుండా..

by sudharani |
సీన్ మారింది.. షారుఖ్‌ను రీప్లేస్ చేసిన ప్రభాస్.. ఒక్క షో కూడా లేకుండా..
X

దిశ, సినిమా : ముంబైలోని ఐకానిక్ థియేటర్ మరాఠా మందిర్‌లో షారుఖ్ - కాజోల్ నటించిన ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’ సినిమా ఇప్పటికీ ప్రదర్శించబడుతుందని చెప్తుంటారు. అయితే డిశంబర్ 21న షారుఖ్ ఫిల్మ్ ‘డంకీ’ విడుదలతో షోస్ అన్నీ ఈ చిత్రానికి ఇచ్చేశారు. కానీ రెండో రోజు సీన్ మారింది. ‘డంకీ’కి ఒక్క షో కూడా కేటాయించకుండా.. అన్నీ ప్రభాస్ ‘సలార్’ చిత్రానికే కేటాయించింది యాజమాన్యం. ‘డంకీ’ మూవీ మిక్స్‌డ్ టాక్.. ‘సలార్’ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే ఇందుకు కారణం. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. మొత్తానికి ప్రభాస్ షారుఖ్‌కు గట్టిపోటీ ఇచ్చాడని.. చరిత్రను తిరగరాశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఐకానిక్ థియేటర్‌ను ఓన్ చేసుకున్న షారుఖ్.. రెబల్ స్టార్ రాకతో తప్పుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

Advertisement

Next Story