- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saif Ali Khan: తెలుగు ఆడియన్స్‌పై సైఫ్ అలీఖాన్ ఆసక్తికర కామెంట్స్.. హీరోలను అలా చూస్తారంటూ
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’లో కీలక పాత్రలో నటించారు. కానీ ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు పైగా విమర్శలు ఎదుర్కొంది. తాజాగా, సైఫ్ విలన్‌గా నటించిన తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించారు. అయితే దేవర మూవీ వరల్డ్ వైడ్‌గా (సెప్టెంబర్ 27న) నేడు గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ తెలుగు ఆడియన్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘తెలుగు ఆడియన్స్ సినిమాలను బాగా ఇష్టపడతారు. మూవీ చూసేటప్పుడు వారు అందులో లీనమైపోయి చూస్తారు. టాలీవుడ్ ఆడియన్స్ తమ అభిమాన హీరోలను దేవుళ్ళ లాగా చూసుకుంటారు. తెలుగు దర్శకులు వాళ్లు తీసే కథ, కథనంపై బలమైన అవగాహన కలిగి ఉంటారు. అయితే బాహుబలి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. పౌరాణిక, చరిత్రాత్మకమైన సినిమాలను చాలా బాగా తెరకెక్కిస్తారు.
నేను తెలుగులో నటించిన ‘దేవర’ చిత్రంలో నా పాత్రకు సంబంధించిన డైలాగ్స్ విషయంలో కొరటాల శివ నాకు చాలా సాయం చేశారు. కొన్ని మాటలు ఎలా పలకాలో కూడా నేర్పించారు. ముంబై నటుడిని అయినప్పటికీ తెలుగులో కంఫర్ట్‌గా పని చేశాను. ఎన్నో సినిమాలు ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి. దక్షిణాది దర్శకులు హీరోలను చూపించే తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.