- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దెయ్యాలను ఆహ్వానించేందుకు రాత్రుళ్లు వింతగా ప్రవర్తిస్తున్న హీరో.. ఆత్మలతో కలిసిన అనుభవంతో..
దిశ, సినిమా : స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు అతీంద్రియ శక్తుల పట్ల మోహం, దెయ్యాల కథలపై ఉన్న ఆసక్తి చూసి ఆశ్చర్యపోయానంటున్నాడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ కె చావ్లా. ఓసారి హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌లో తాను, సైఫ్ కలిసి ఓయిజా బోర్డ్ గేమ్ ఎలా ఆడారో వివరిస్తూ.. ‘మాతోపాటు అక్కడ ఇంగ్లండ్‌కు చెందిన సైఫ్ స్నేహితులు ఉన్నారు. వారంతా ఆత్మలతో కనెక్ట్ అయ్యే ప్రయత్నంలో ఆంగ్ల సంభాషణల్లోనే ఓ ప్రత్యేకమైన కోడ్ సృష్టించారు. ఓయిజా బోర్డ్ గేమ్ ద్వారా దెయ్యాలను పిలవడానికి సైఫ్ ప్రయత్నించాడు. అప్పుడు నేను ‘హర్యానాలోనూ ఇంగ్లీష్ మాట్లాడే దెయ్యం ఉంటుందా? ప్రయత్నిస్తే స్పందిస్తుందా?’ అని హాస్యభరితంగా ప్రశ్నించాను. ఏదేమైనప్పటికీ ఇంగ్లండ్‌కు చెందిన ఒక మహిళ తన సొంత కుటుంబానికి చెందిన ఆత్మలతో కలిసిన అనుభవం గురించి చెప్పడం వింతగా అనిపించింది’ అని చెప్పాడు. చివరగా సైఫ్ ఇప్పటికీ అతని కొడుకు తైమూర్‌తో కలిసి భయానక షోలు చూస్తాడని, ఆయనకు హారర్ అంటే పిచ్చి అని తెలిపాడు చావ్లా.