ఇంకా నయం మా ఆవిడను పెళ్లి చేసుకున్నా,.. వాళ్ల అక్కను చేసుకుంటే నా పని గోవిందా... స్టార్ హీరో కామెంట్స్

by Sujitha Rachapalli |
ఇంకా నయం మా ఆవిడను పెళ్లి చేసుకున్నా,.. వాళ్ల అక్కను చేసుకుంటే నా పని గోవిందా... స్టార్ హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాభై ఏళ్లు దాటినా ఇంకా ముప్పైలలో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాడు. బెబో కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకుని లైఫ్ ను వీలైనంత ఎంజాయ్ చేస్తున్నాడు. వెకేషన్స్, పార్టీలు అంటూ ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మొదటి వైఫ్ అమృతా సింగ్ తో సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ కు జన్మనిచ్చిన ఆయన.. ఇప్పుడు వాళ్లకు బ్రదర్ మాదిరిగానే కనిపిస్తున్నాడు. తాజాగా కూతురుతో కలిసి దుబాయ్ టూరిజం యాడ్ చేసి వావ్ అనిపించాడు. ఇక కరీనాతో కలిసి తైమూర్, జైకు వెల్ కమ్ చెప్పిన ఆయన.. తాజా ఇంటర్వ్యూలో పర్సనల్ కైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

కాగా కరీనా కపూర్ సిస్టర్ కరిష్మా కపూర్ తో చాలా సినిమాల్లో నటించిన సైఫ్.. ఆమె గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు. థాంక్ గాడ్.. కరీనాను పెళ్లి చేసుకున్నా.. కరిష్మను చేసుకుంటే ఏం అయిపోయేవాడినని నవ్వేశాడు. ఏసీ రిమోట్ కోసమే చాలా సార్లు గొడవపడ్డం.. ఇక మ్యారేజ్ చేసుకుంటే రోజుకు ఎన్ని గొడవలు జరిగేవో అని చెప్పుకొచ్చాడు. కాగా కరిష్మ.. సైఫ్ కు మంచి ఫ్రెండ్. కాగా ప్రస్తుతం తను కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంది. చెక్కు చెదరని అందంతో మెప్పిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed