పొలిటికల్ ఎంట్రీపై సాయిధరమ్ తేజ్ క్లారిటీ

by Hamsa |   ( Updated:2023-04-21 14:33:28.0  )
పొలిటికల్ ఎంట్రీపై సాయిధరమ్ తేజ్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి చిరంజీవి అల్లుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల సాయ్ ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయ్యాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. విరామం తర్వాత సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వీరుపాక్ష’. దీనికి కార్తిక్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా (ఏప్రిల్ 21) ఈరోజు విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు పాలిటిక్స్ మీద ఎలాంటి అవగాహన లేదు. నాకు తెలిసింది కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే. కానీ మామయ్య పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. పార్టీ కార్యకర్తగా కూడా నేనేం చేయాలో నా భాద్యతలు నిర్వహిస్తాను. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి మాత్రం లేదు. కానీ వచ్చే ఎలక్షన్స్ టైం లో పవన్ కళ్యాణ్ మామయ్య నన్ను పిలిస్తే ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read...

బిగ్ న్యూస్: RRR టీమ్‌తో అమిత్ షా భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కేంద్రమంత్రి టూర్!

Advertisement

Next Story