Sai Pallavi వివాదాస్పద వ్యాఖ్యలు.. బిగ్ షాక్ ఇచ్చిన నెటిజన్స్?

by Manoj |   ( Updated:2022-06-15 09:36:43.0  )
Sai Pallavi Controversy Comments On Kashmir Files And Cow Smuggling
X

దిశ, వెబ్‌డెస్క్: Sai Pallavi Controversy Comments On Kashmir Files And Cow Smuggling| డాన్సింగ్ క్యీన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన నటనతో అందంతో అనేక సినిమాల్లో నటించి తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి, రానాతో కలిసి 'విరాటపర్వం' మూవీలో నటించింది. జూన్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. వరుస ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

సాయి పల్లవి ఈ మధ్యనే కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశానని చెప్పుకొచ్చింది. ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ..' కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కశ్మీరి పండిట్లను ఎలా చంపారో ఆ సినిమాలో చూపించారన్నారు. కానీ ఇప్పుడు కూడా గోవధ చేస్తున్నారంటూ.. ఆవును తీసుకెళ్తున్న ముస్లీం డ్రైవర్‌ను కొట్టి జై శ్రీరామ్ అనాలన్నారు. అప్పుడు జరిగిన దానికి.. ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది అంటూ సాయి పల్లవి ప్రశ్నించింది'. దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాయి పల్లవి చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతుందని పలువురు నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. విరాటపర్వం చూడమంటూ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed