- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sai Dharam Tej: నెక్ట్స్ మూవీకి రెడీ అయిన మెగా మేనల్లుడు.. హీరో న్యూ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!
దిశ, సినిమా: మెగా హీరో సాయి దుర్గ తేజ్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు ప్రారంభించాడు. విరూపాక్ష, బ్రో లాంటి విజయాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉండబోతుందని సమాచారం. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో తన పాత్ర కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు ఈ మెగా మేనల్లుడు. ఇటీవల జరిగిన ఉషా పరిణయం ప్రీరిలీజ్ వేడుకకు వచ్చిన సాయి దుర్గ తేజ్ గుబురు గడ్డంతో, డిఫరెంట్ హెయిర్‌స్టయిల్‌తో కనిపించాడు. ఇక తను నటిస్తున్న తాజా చిత్రంలో ఈ గెటప్‌లోనే సాయి కనిపించనున్నాడని తెలుస్తుండగా.. ఈ గెటప్‌లో తేజ్ అదిరిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు.