- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YUVASAMRAT RAVI: రైతుబిడ్డా యాడున్నావ్?.. అన్నదాతలకు ఇస్తానన్న పైసలేవి అంటూ ఏకిపారేసిన ప్రముఖ యూట్యూబర్..(వీడియో)
దిశ, సినిమా: బిగ్‌బాస్ రియాలీటీ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ అయిన వారిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఒకరు. సాధారణ రైతు బిడ్డగా హౌజ్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి తన గేమ్‌తో బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచాడు. ఇక ట్రోఫి ఇచ్చే సమయంలో తనకు వచ్చిన డబ్బులు మొత్తం అన్నదాతల కోసం ఖర్చు పెడతాను అంటూ మాట ఇచ్చాడు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రైతు బిడ్డ ఇచ్చిన మాటను గట్టు మీద పెట్టేశాడని, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, టీవీ షోలతో అతను తీరిక లేనంత బిజీగా మారిపోయాడని ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ యూట్యూబర్ యువ సామ్రాట్ రవి ఈ విషయంపై రైతు బిడ్డను ఏకిపారేశారు.
ఆయన మాట్లాడుతూ.. 'నాకు కూడా బిగ్ బాస్‌కి వెళ్లాలని ఉండేది. కానీ లాస్ట్ సీజన్ చూశాక ఇక బిగ్ బాస్‌కి వెళ్లాలనే ఆసక్తి పోయిది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో చాలా పెద్ద డ్రామా నడిచింది. ముఖ్యంగా రైతు బిడ్డ పేరుతో హౌజ్‌లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ సింపథీ డ్రామా మామూలుగా ఆడలేదు. ' నేను రైతు బిడ్డనమ్మా.. విజేతగా నిలిస్తే పేద రైతులకే మొత్తం పైసలిస్తానమ్మా' అని డ్రామాలు ఆడి విన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు ఆ మనీ రైతుల కోసం ఖర్చు చేయకుండా ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు. కారు కూడా కొనుకున్నాడు. రైతు బిడ్డ కారు కొనుక్కో కూడదా అంటే కొనుక్కోవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ రైతుల పేరు చెప్పుకుని కాదు. రైతులకు ఇస్తానన్న డబ్బులైనా ఇవ్వాలి కదా. ఈ రైతుబిడ్డ కన్నింగ్ డ్రామాలు చూసిన తర్వాత.. బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లాలనే ఇంట్రెస్ట్ చచ్చిపోయింది' అంటూ యువ సామ్రాట్ రవి పల్లవి ప్రశాంత్‌పై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(video link credits to life by unlimited premium intagram id)