ఆస్కార్‌కు నామినేషన్స్ పంపించని రష్యా.. ఉక్రెయిన్‌తో వార్ ఎఫెక్ట్

by sudharani |
ఆస్కార్‌కు నామినేషన్స్ పంపించని రష్యా.. ఉక్రెయిన్‌తో వార్ ఎఫెక్ట్
X

దిశ, సినిమా : రష్యా 2023కు గాను ఆస్కార్‌కు అధికారికంగా ఎలాంటి నామినేషన్స్ పంపించనట్లుగా ఇంటర్నేషనల్ మీడియా ధృవీకరించింది. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా.. తమ శత్రు దేశానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతిస్తుండటంతో ఆస్కార్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో సంబంధాలు తెంచుకుంటామని ఇప్పటికే ప్రతిజ్ఞ చేసిన ఆ దేశం.. యూరప్, ఆసియా కోసం ఆస్కార్ మాదిరిగానే ఓ ఈవెంట్ ప్లాన్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రష్యాకు చెందిన ప్రముఖ చిత్రనిర్మాత నికితా మిఖల్కోవ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాడని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed