నా జీవితంలో అవన్నీ చీకటి రోజులే : డివోర్స్‌పై రుబీనా

by Hamsa |   ( Updated:2022-09-18 08:20:02.0  )
నా జీవితంలో అవన్నీ చీకటి రోజులే : డివోర్స్‌పై రుబీనా
X

దిశ, సినిమా : యంగ్ యాక్ట్రెస్ రుబీనా దిల్లాక్ తన భర్త అభినవ్ శుక్లాతో విడాకులు తీసుకోవాలనుకున్నది నిజమేనని అంగీకరించింది. ప్రస్తుతం ఈ జంట 'ఝలక్ దిఖ్లాజా 10' డ్యాన్స్ షోలో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి ప్రసారంకానున్న ఎపిసోడ్‌ ట్రైలర్‌‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తన డివోర్స్ ఇష్యూపై స్పందించిన రుబీనా తిరిగి కలిసిపోవడానికి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లింది నిజమేనని ఒప్పుకుంది. అయితే ఆ సమయాన్ని తమ జీవితంలో చీకటి కాలంగా పేర్కొన్న ఆమె.. తన ముక్కుసూటితనం వల్లే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా, టీవీ చానెల్స్ సినీతారలపై ఆధిపత్యం చెలాయించేందుకు వివక్షాపూరితంగా ఫేక్ వార్తలు రాస్తున్నారని వాపోయింది. అయితే అలాంటి చిల్లర పుకార్లు తనను ఏమాత్రం ప్రభావితం చేయలేవని చెబుతూ తమ మధ్య ప్రస్తుతం ఎలాంటి డిస్టర్బెన్స్ లేదని స్పష్టం చేసింది.

Also Read :నాలో అందమైన మార్పు తెచ్చింది ఆ చిత్రమే.. శ్రుతి ఇంట్రెస్టింగ్ పోస్ట్

Advertisement

Next Story