గ్రాండ్‌గా విడుదలైన 'యమునా నది' ట్రైలర్!

by Hajipasha |   ( Updated:2023-01-29 14:26:38.0  )
గ్రాండ్‌గా విడుదలైన యమునా నది ట్రైలర్!
X

దిశ, సినిమా: రోషన్ బాల్ భోగట్టి, ఊర్విజ జంటగా రాబోతున్న చిత్రం 'యమునా నది'. సాయి లక్ష్మి గణపతి మూవీ క్రియేషన్స్ పతాకంపై యన్.కె. సాయి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్, రాము, తాండవ కృష్ణ చేతుల మీదుగా పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన అతిథులు.. సినిమా ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయని, మంచి కంటెంట్‌తో వస్తు్న్న మూవీ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయన్నారు. అలాగే ఈ 'యమునా నది' కచ్చితంగా బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కాగా ఈ సినిమాకు శ్రీరామ్ సంగీతం అందించాడు.

READ MORE

'అమిగోస్'తో టాలీవుడ్ ఎంట్రీని ల‌క్కీగా ఫీల్ అవుతున్నా: Ashika Ranganath

Advertisement

Next Story