- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Pothineni: రొమాంటిక్ మెలోడీ.. ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి థర్డ్ సింగిల్
దిశ, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ కావ్య థాపర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా.. మొదటి రెండు సింగిల్స్ ఆడియన్స్‌ని అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇందులో నుంచి తాజాగా థర్డ్ సింగిల్ ‘క్యా లఫ్డా’ రిలీజ్ చేసి మరింత హీట్ పెంచారు మేకర్స్.
రొమాంటిక్ మెలోడీ ఆఫ్ ది సీజన్‌గా రూపొందిన ‘క్యా లఫ్డా’ ఒక అద్భుతమైన ట్రాక్, డిఫరెంట్ అండ్ యూనిక్ కంపోజిషన్‌తో ఇన్స్టెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ‘నరం నరం.. ఘరం ఘరం’ అంటూ సాగే ఈ పాట వెరీ లైవ్లీ మూడ్‌లో అలరిస్తుంది. అలాగే రామ్, కావ్యా థాపర్ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ, విజువల్ ఎట్రాక్షన్‌గా ఉన్నాయి. కాగా.. భారీ అంచనాల మధ్య ‘డబుల్ ఇస్మార్ట్’ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.