మళ్లీ జబర్దస్త్‌కు రోజా.. ప్లీజ్ నువ్వు షోకి రావడానికి వీళ్లేదు అంటూ ఆడియన్స్ కామెంట్స్!

by Jakkula Samataha |
మళ్లీ జబర్దస్త్‌కు రోజా.. ప్లీజ్ నువ్వు షోకి రావడానికి వీళ్లేదు అంటూ ఆడియన్స్ కామెంట్స్!
X

దిశ, సినిమా : సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె సినిమాల్లో తన అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆ రోజుల్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే మెల్లిగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాక, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు తీసుకుంది.

రాజకీయంగానే కాకుండా రోజా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తల్లి పాత్రలో పలు సినిమాల్లో నటించింది. అలాగే జబర్దస్త్‌లో జడ్జీగా చేసి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ కామెడీ షోలో ఆమె వేసే పంచ్ డైలాగ్స్, కమెడియన్స్‌తో ఆమె కలిసిపోయిన విధానం అందరికీ నచ్చేది. ఇక నాగబాబుతో కలిసి ఆమె జడ్జీగా చేయడం, మధ్యలో వీరు వేసే కామెంట్స్, కామెడీతో వీరద్దరు హిట్ ఫెయిర్‌గా నిలిచారు. కానీ మల్లెమాలతో ఉన్న విభేదాల కారణంగా, నాగబాబు జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పడం, మంత్రి పదవి రావడంతో రోజా జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రోజా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో త్వరలో మళ్లీ రోజా బుల్లితెర మీదకు ఎంట్రీ ఇవ్వనుంది. జబర్దస్త్ జడ్జిగా రాబోతుంది అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా మీరు రాకండి రోజా ప్లీస్ అంటూ ఆమె అంటే పడని వారు కామెంట్స్ చేస్తున్నారు. రోజా జబర్దస్త్‌కు రావడానికి వీళ్లేదు, ఆమె ఓవర్ యాక్షన్ మేము చూడలేం, ఆమెను ఈ షోకు రానివ్వకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఓ వర్గం వారు. జబర్దస్త్ లేటేస్ట్ ప్రోమో కింద ఈ కామెంట్స్ ఉన్నాయి.

Advertisement

Next Story