పవన్ జర్నీ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్.. అతను కాల్ చేసి చెప్పాడంటూ ఆసక్తికర పోస్ట్

by Hamsa |   ( Updated:2024-06-06 02:58:44.0  )
పవన్ జర్నీ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్.. అతను కాల్ చేసి చెప్పాడంటూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించారు. దీంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ నెట్టింట చేసే రచ్చ అంత ఇంత కాదు. గత రెండు రోజుల నుంచి నానా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో.. పవన్ తనయుడు అకీరా నందన్ తండ్రి కోసం ఓ స్పెషల్ వీడియోను ఎడిట్ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. ఆ వీడియోను తన తల్లి రేణు దేశాయ్‌ను నెట్టింట పోస్ట్ చేయమనడంతో.. ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.

అంతేకాకుండా నా చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్న జర్నీ వీడయోను స్పెషల్ ఫోన్ చేసి నన్ను షేర్ చేయమన్నాడు. అకీరా ఆనందం కోసం షేర్ చేశాను. నాన్న అంటే అకీరా నందన్ అమితమైన ప్రేమను కలిగి ఉన్నాడు. తండ్రి విజయం సాధించడంతో సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నాడు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అలాగే సూపర్ అకీరా అంటూ ఫైర్ ఎమోజీలు పంపుతున్నారు.

Advertisement

Next Story