ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిని కనక్ రెలే కన్నుమూత

by Hamsa |   ( Updated:2023-02-23 06:05:57.0  )
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిని కనక్ రెలే కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిని కనక్ రెలే మృతిచెందింది. గుండెపోటుతో బుధవారం తుది శ్వాస విడిచింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.

నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్. ఆమెకు భర్త యతీంద్ర రెలే, కుమారుడు రాహుల్, కోడలు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. కనక్ రేలే జూన్ 11, 1937న గుజరాత్‌లో జన్మించారు. కనక్ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆమె మేనమామ కళలను నెరవేర్చాలని భావించి నాట్యాన్ని నేర్చుకున్నారు.

Advertisement

Next Story