రూ.200 కోట్ల రెమ్యూనరేషన్.. ఆ సౌత్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-21 06:48:59.0  )
రూ.200 కోట్ల రెమ్యూనరేషన్.. ఆ సౌత్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే నోరు తెరిచే వాళ్లం. అయితే ఇటీవల హీరో రెమ్యూనరేషన్ ఏకంగా వందల కోట్లు దాటుతోంది. తాజాగా తమిళ స్టార్ హీరో ఓ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్లు పారితోషికం అందుకోనున్నాడన్న వార్త దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.200 కోట్లు తీసుకొనున్నాడట ఈ స్టార్ హీరో. తమిళనాడులో ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతోంది. వారసుడు సినిమాకు విజయ్ రూ.140 కోట్లు తీసుకున్నాడని టాక్. లియో సినిమాకు రూ.180 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా విజయ్ ప్రస్తుతం సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే విజయ్ సినిమాకు నాన్ థియట్రికల్ రైట్స్ రూపంలో రూ.250 కోట్లు, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా రూ.100 కోట్లు థియేటర్ల నుంచి కలెక్షన్లు రాబడుతుంది. దీంతో విజయ్ తో సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఎంతైనా తగ్గడం లేదని తెలుస్తోంది.

Also Read...

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ చిత్రం ‘విరూపాక్ష’

Advertisement

Next Story