- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పచ్చని ప్రదేశాల సందర్శనతో డిప్రెషన్, యాంగ్జటీకి చెక్
దిశ, ఫీచర్స్: ఆకుపచ్చని ప్రదేశాలను సందర్శించడం.. మనుషుల్లో మెంటల్ హెల్త్ డ్రగ్ వినియోగాన్ని తగ్గిస్తుందని తాజా పరిశోధన గుర్తించింది. వారానికి మూడు, నాలుగు సార్లు పార్క్, కమ్యూనిటీ గార్డెన్, లేదా చెట్లు ఎక్కువ కలిగిన ప్రదేశంలో స్పెండ్ చేయడం మూలంగా ఆందోళన, డిప్రెషన్ కోసం మందులు తీసుకునే అవకాశాలను తగ్గించిందని పేర్కొంది. ఫిన్నిష్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ సైంటిస్టుల పరిశోధనలో.. తరుచుగా పచ్చని ప్రదేశాలను సందర్శించడం వల్ల నగర నివాసులు ఉబ్బసం, అధిక రక్తపోటు మందులను మూడు వంతులు తీసుకునే అవకాశాలను తగ్గించిందని తేలింది.
మానసిక ఆరోగ్యానికి గ్రీన్ స్పేస్ ఎందుకు మంచిది?
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగానికి పైగా నగరాల్లో నివసిస్తున్నారు. UN అంచనా ప్రకారం, ఈ సంఖ్య 2030 నాటికి 60 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. అంటే ముగ్గురిలో ఒకరు సిటీలోనే నివసిస్తారని అర్థం. కానీ ప్రకృతికి అందుబాటులో లేకపోవడం శారీరక, మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.16వేల మందిపై సర్వే చేసిన ఫిన్నిష్ పరిశోధకులు.. అడవులు, ఉద్యానవనాలు మాత్రమే కాకుండా చిత్తడి నేలలు, శ్మశానవాటికలు, జంతు ప్రదర్శన శాలలు, సరస్సుల వంటి నీలి రంగు ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతారో ప్రశ్నించారు. ఇలాంటి టైమ్‌లో ఎన్ని ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకున్నారనే దానిపై సమాచారాన్ని సేకరించారు.
ఈ క్రమంలో నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం, డ్రగ్స్ వినియోగం మధ్య సంబంధాన్ని గుర్తించారు. వారానికి మూడు లేదా నాలుగు సార్లు గ్రీన్ స్పేస్ సందర్శించే నివాసి మానసిక ఆరోగ్య మందులను ఉపయోగించే అవకాశం 33 శాతం తక్కువగా, ఆస్తమా మందులను వినియోగించే చాన్స్ 26 శాతం తక్కువగా ఉంటుంది. అయితే ప్రభావాలు సమానంగా వ్యాపించలేదు. తక్కువ సామాజిక ఆర్థిక ప్రాంతాలలో గ్రీన్ స్పేస్ సందర్శనల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు అలాంటి ప్రదేశాలకు తక్కువ ప్రాప్యతను కలిగి ఉన్నారు.