- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉన్న.. అద్భుతమైన చిత్రాలు , సిరీస్..
దిశ, సినిమా: రోజు రోజుకి ఓటీటీలో హవా తెగ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. 20 నుంచి 30 రోజుల్లో ఓటీటీలోకి సినిమాలను వదులుతున్నారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాలు మాత్రం నెల దాటిన తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు అయితే.. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా కొన్ని తమిళ, తెలుగు చిత్రాలు, సిరీస్ లు OTT విడుదలకు సిద్ధం అయ్యాయి.
1. ఓటీటీలో నేరుగా రానున్న సినిమా ‘సైరన్’. భాగ్యరాజ్ కథ, దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్, టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా కలిసి నటించారు.కాగా ఈ సినిమా ను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కి రానుంది.
2. తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘యానై ముగతాన్’ అనే చిత్రం గతేడాది ఏప్రిల్‍లో థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకొగా ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తోంది. ‘గుడ్ లక్ గణేశా’ అనే టైటిల్ తొ తెలుగులో నేరుగా ఓటీటీ లోకి రానుంది. కాగా ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 19 నుండి స్ట్రీమింగ్‍కు రానుంది.
3. క్రైమ్ సిరీస్ ‘పోచర్’ విడుదల గురించి ప్రకటన వచ్చింది. రిచీ మెహతా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో నిమిష సంజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సిరీస్ గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి.