కంచం ముందుకు, మంచం మీదకి.. ఆడపిల్లలు పిలవగానే రావాలి (వీడియో)

by Prasanna |   ( Updated:2023-04-08 11:55:34.0  )
కంచం ముందుకు, మంచం మీదకి.. ఆడపిల్లలు పిలవగానే రావాలి (వీడియో)
X

దిశ, సినిమా: ‘రావణాసుర’ సినిమాలో అమ్మాయిల గురించి రవితేజ చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం ఘనంగా విడుదలవగా.. ట్విట్టర్ రివ్యూ పాజిటీవ్‌గానే ఉంది. అయితే ఈ మూవీనుంచి లీక్ అయిన ఓ సీన్‌లో ‘కంచం ముందుకి, మంచం మీదకి పిలవగానే ఆడపిల్లలు రావాలి. లేదంటే నాకు మండుద్ది రా..’ అంటూ ఓ అమ్మాయిని భయపెడుతూ రవితేజ చెప్పిన డైలాగ్ చర్చనీయాంశమైంది. దీనిపై మహిళలు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠతో నెటిజన్లు భిన్నమైన చర్చలు మొదలుపెట్టారు. ఇక రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా నటించారు

Advertisement

Next Story