‘రావణాసుర’తో థియేటర్స్ దద్దరిల్లుతాయి.. కుమ్మేద్దాం అంటున్న రవితేజ

by sudharani |   ( Updated:2023-04-02 11:30:46.0  )
‘రావణాసుర’తో థియేటర్స్ దద్దరిల్లుతాయి.. కుమ్మేద్దాం అంటున్న రవితేజ
X

దిశ, సినిమా : ఏప్రిల్ 7న ‘రావణాసుర’తో థియేటర్స్ దద్దరిల్లుతాయన్నారు హీరో రవితేజ. ఏప్రిల్ 7న సినిమా విడుదల కాబోతుండగా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే ధీమాతో ఉన్నట్లు చెప్పాడు. డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్‌కు వెళ్తాడని.. ఈ చిత్రంలో సరికొత్త సుశాంత్‌ను చూడబోతున్నారని తెలిపాడు. ఇక హైపర్ ఆదితో తనకు బాగా సెట్ అయిందన్న రవితేజ.. తమ కాంబినేషన్‌కు బ్రైట్ ఫ్యూచర్ ఉందన్నాడు. నిర్మాత అభిషేక్ నామా మల్టీ టాలెంటెడ్ అని.. ‘రావణాసుర’ పేరుతో పాటు టైటిల్ డిజైనింగ్‌ వర్క్ కూడా ఆయనదేనని వివరించాడు.

Also Read..

ఇన్‌స్టాగ్రామ్‌కు ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్.. నిమిషాల్లో లక్షల మంది ఫాలోవర్స్

Advertisement

Next Story